కరోనా(Corona virus) వ్యాప్తిని అంచనా వేసేందుకు జాతీయ స్థాయిలో నాలుగో విడత సెరో సర్వే చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇందుకు కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని పేర్కొంది. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనున్నట్లు వెల్లడించింది.
ICMR: దేశవ్యాప్తంగా నాలుగో విడత సెరో సర్వే! - ఐసీఎంఆర్ సీరో సర్వే
దేశవ్యాప్తంగా నాలుగో విడత సెరో సర్వేను భారత వైద్య పరిశోధన మండలి(ICMR) చేపట్టనుందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని అభిప్రాయపడింది.
నాలుగో విడత సీరో సర్వేపై కేంద్రం
దేశంలో కొవిడ్(Covid) ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్రం అభిప్రాయపడింది. గతనెలతో పోలిస్తే కొత్త కేసుల నమోదు 78 శాతం, పాజిటివిటీ రేటు 74 శాతం తగ్గాయని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించడం కొనసాగించాలని.. వ్యాప్తిని కట్టడి చేయడం ద్వారా వైద్యారోగ్య రంగంపై ఒత్తిడి తగ్గించవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి :'టీకా వృథాను 1శాతంలోపు కట్టడి చేయండి'