కొవిడ్ రోగుల్లో ఇతర వ్యాధులు సంక్రమించడం వల్లే వైరస్ రెండో ఉద్ధృతి సమయంలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య పరిశోధనా మండలి పేర్కొంది. సెకండ్ వేవ్ సమయంలో మరణాల పెరుగుదలపై అధ్యయనం చేసినట్లు తెలిపింది.
ఆసుపత్రుల్లో చేరిన మొత్తం కొవిడ్ బాధితుల్లో 10.6 శాతం మంది మృతిచెందగా.. కొవిడ్‌తో పాటు ఇతర వ్యాధులకు గురైన వారిలో మృతుల సంఖ్య 56.7 శాతంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 10 ఆసుపత్రుల్లో అధ్యయనం చేసి ఈ నిర్ధరణకు వచ్చారు నిపుణులు. డాక్టర్ కామిని వాలియా ఈ సర్వే చేశారు. బాధితుల్లో సగానికి పైగా ఇతర వ్యాధులతో మృతిచెందిన వారే అని స్పష్టం చేశారు. మ్యూకోర్మైకోసిస్ బాధితులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.