వ్యాక్సిన్ వేయించుకున్న, వేయించుకోనివారికి సమానస్థాయిలో డెల్టా వేరియంట్(Delta Variant) సోకుతోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కానీ టీకా వేయించుకోనివారితో పోలిస్తే.. వ్యాక్సిన్ పొందినవారిలో మరణాల రేటు తగ్గుతుందని వెల్లడించింది. ఈ మేరకు చెన్నైలో ఐసీఎంఆర్ అధ్యయనం చేపట్టింది.
వ్యాక్సిన్ వేగవంతం చేస్తేనే..
తదుపరి వచ్చే కరోనా వేవ్‌లను తగ్గించాలంటే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ సూచించింది. కొత్త వేరియంట్లను, వాటి ప్రభావశీలతను అంచనా వేయడానికి జీనోమిక్ సర్వేలను కొనసాగించాలని పేర్కొంది. రోగనిరోధక ప్రతిస్పందన వ్యవస్థ నుంచి తప్పించుకోగల కొత్త ఉత్పరివర్తనాల ఆవిర్భావం కారణంగా మళ్లీ భారీస్థాయిలో ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చని తెలిపింది.