తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మరో 4 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం' - కరోనా

దేశంలో ఎక్కువ మంది ప్రజలు కరోనా బారిన పడడానికి కారణం వైరస్ వేగంగా వ్యాప్తి చెందడమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్​లో ఉన్న మూడు విదేశీ కరోనా వేరియంట్లు దేశంలో ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడానికి కారణమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Covid
కరోనా

By

Published : May 1, 2021, 5:31 AM IST

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ మంది ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఈటీవీ భారత్​తో అన్నారు. అయితే 4-6 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుతుందని ఐసీఎంఆర్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.

మూడు దేశాల కరోనా డబుల్ మ్యూటెంట్ వైరస్, భారత మ్యూటెంట్ వైరస్ వల్ల దేశంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోందని తెలిపారు. ఇండియాలో బ్రెజిల్, యూకే, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన కరోనా వేరియంట్లు ఉన్నాయని గుర్తించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:భారత్​ నుంచి లండన్ పరారైన నేరగాళ్లపై పుస్తకం

ABOUT THE AUTHOR

...view details