దేశంలో 21శాతం మంది ప్రజలు కరోనా ప్రభావానికి గురైనట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) చేసిన సెరో సర్వేలో తేలింది. ఐసీఎంఆర్ గతేడాది డిసెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 8వరకూ జాతీయ స్థాయిలో జరిపిన సెరో సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
దేశవ్యాప్తంగా 28వేల 589 మందిపై అధ్యయనం చేయగా ఇందులో 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన 21.4శాతం మంది కరోనా ప్రభావానికి గురైనట్లు తేలింది. 10 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న 25.3శాతం మందిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. అలాగే పట్టణ మురికివాడల్లో 31.7 శాతం, మండల స్థాయి మురికివాడల్లో 26.2 శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు.