దేశంలో కరోనా రెండోదశ తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో డెల్టాప్లస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రమాదకరంగా భావిస్తున్న ఈ కొత్త వేరియంట్‌పై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) పరిశోధనలు ప్రారంభించాయి. దేశ పౌరులకు పంపీణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు.. కొత్త కొవిడ్ వేరియంట్‌ను ఎంత సమర్థంగా అడ్డుకుంటాయన్న అంశంపై పరిశోధకులు దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత టీకాలు 'డెల్టా ప్లస్' వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తున్నాయా? అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఎన్‌ఐవీ తెలిపింది.