కర్ణాటకలోని హావేరిలో ఐసీఐసీఐ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ చేతి వాటం ప్రదర్శించాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన అతడు బ్యాంకు కస్టమర్ల సొమ్మును కాజేశాడు. ఆఖరికి పోలీసులకు చిక్కాడు. అసలేం జరిగిందంటే?
వీరేశ్ కాశీమత్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతడికి బాగా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే అలవాటు ఉంది. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్లో డిపాజిట్ చేసిన డబ్బును తనకు కావాల్సిన వ్యక్తి ఖాతాలో జమ చేశాడు. బ్యాంక్‌లో లెక్కలు తేడా రావడం గమనించిన మేనేజర్ షహర్ అనుమానంతో అసిస్టెంట్ మేనేజర్ వీరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు బ్యాంక్‌లో 2 కోట్ల 36 లక్షల రూపాయలు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. దీని వెనక నిందితుడు వీరేశ్ హస్తం ఉందని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బుతో వీరేష్ ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాడని ఎస్పీ శివ కుమార్ తెలిపారు. రూ.రెండు కోట్లకు పైగా అక్రమాలు జరిగినందున వీలైనంత త్వరగా కేసును సీఐడీకి బదిలీ చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
జనం డబ్బుతో ఆన్‌లైన్ గేమ్స్.. రూ.2.4కోట్లు మాయం చేసిన బ్యాంక్ అధికారి - ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ చేతివాటం
ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారి.. కస్టమర్ల సొమ్మును కాజేశాడు. రూ.2.36 కోట్ల కస్టమర్ల డబ్బులను సొంత అవసరాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించారు. ఆఖరికి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఐసీఐసీఐ బ్యాంకులో కస్టమర్లు వేసిన డబ్బుల్ని తనకు కావాల్సిన వారి ఖాతాలో వీరేశ్ జమ చేశాడు. వినియోగదారుల ఖాతాల్లోన్ని తేడాలు రావడం వల్ల ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ షహర్ ఫిర్యాదు చేశారు. వీరేశ్ కాశీమఠ్ ఏకంగా రూ.2.36 కోట్లను వినియోగదారుల ఖాతాల నుంచి దారి మళ్లించాడు. 2022 ఆగస్టు నుంచి 2023 ఫిబ్రవరి వరకు వీరేశ్ ఈ మోసానికి పాల్పడ్డాడు. నిందితుడు వీరేష్ నుంచి రూ.32లక్షలను స్వాధీనం చేసుకున్నాం. కేసును వీలైనంత త్వరగా సీఐడీకి అప్పగిస్తాం. వీరేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం.
--శివ కుమార్, ఎస్పీ