తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Railway jobs 2023 : రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లైకు 2 రోజులే ఛాన్స్​!

Railway jobs 2023 : చెన్నై ఇంటిగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీ 2023-24 సంవత్సరానికి గాను అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..

ICF Recruitment 2023 for 782 vacancies apply online
Railway jobs 2023

By

Published : Jun 28, 2023, 11:15 AM IST

Updated : Jun 28, 2023, 1:14 PM IST

Railway jobs 2023 : చెన్నై ఇంటిగ్రల్ కోచ్​ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్​) అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్​ ద్వారా మొత్తం 782 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్రెంటీస్​ పోస్టుల వివరాలు

  • కార్పెంటర్​ - 90
  • ఎలక్ట్రీషియన్​ - 122
  • ఫిట్టర్​ - 167
  • మెషినిస్ట్​ - 71
  • పెయింటర్​ - 87
  • వెల్డర్​ - 227
  • ఎమ్​ఎల్​టీ (రేడియోలజీ) - 4
  • ఎమ్​ఎల్​టీ (ఫేథాలజీ) - 4
  • పీఏఎస్​ఏఏ - 10

నోట్​ :మొత్తంగా చూసుకుంటే.. 252 ఫ్రెషర్స్​, 530 ఎక్స్​-ఐటీఐ అప్రెంటీస్​ పోస్టులను ఈ నోటిఫికేషన్​ ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు
ICF Recruitment qualifications : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డుల​ నుంచి 10వ తరగతి, 10+2 ఉత్తీర్ణత సాధించడం సహా, సంబంధిత ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా పొంది ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

వయోపరిమితి
ICF Recruitment age limit : అభ్యర్థుల వయస్సు 2023 జూన్​ 30నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ట్రైనింగ్​ పీరియడ్​

  • ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్​ (ఫ్రెషర్​) - 2 సంవత్సరాలు
  • కార్పెంటర్​, పెయింటర్​ (ఫ్రెసర్​) - 2 సంవత్సరాలు
  • వెల్డర్​ (ఫ్రెసర్​) - 1 సంవత్సరం 3 నెలలు
  • ఎమ్​ఎల్​టీ (రేడియోలజీ & ఫేథాలజీ) (ఫ్రెషర్​) - 1 సంవత్సరం 3 నెలలు
  • ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, మెషినిస్ట్​ (ఎక్స్​-ఐటీఐ) - 1 సంవత్సరం
  • కార్పెంటర్​, పెయింటర్​, వెల్డర్​ ​ (ఎక్స్​-ఐటీఐ) - 1 సంవత్సరం
  • ప్రోగ్రామింగ్​ అండ్​ సిస్టమ్​ అడ్మిన్​ అసిస్టెంట్​ ​ (ఎక్స్​-ఐటీఐ) - 1 సంవత్సరం

అప్రెంటీస్​ స్టైఫండ్​

  • ఫ్రెషర్​ (10వ తరగతి) : రూ.6000/నెల
  • ఫ్రెషర్ (10+2) : రూ.7000/ నెల
  • ఎక్స్​ ఐటీఐ : రూ.7000/ నెల

అప్లికేషన్​ ఫీజు
ICF Recruitment application fee : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100+సర్వీస్​ ఛార్జీలు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు అప్లికేషన్​ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం
ICF Recruitment application process : ఆసక్తి గల అభ్యర్థులు ఇంటిగ్రల్​ కోట్​ ఫ్యాక్టరీ, చెన్నైకు సంబంధించిన అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి. దరఖాస్తు ఎలా చేయలాంటే..

  • అధికారిక వెబ్​సైట్​లోని అప్లికేషన్​ ఫారమ్​ నింపాలి.
  • అవసరమైన పత్రాలను అప్​లోడ్​ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ తీసుకుని, భవిష్యత్​ రిఫరెన్స్​ కోసం దగ్గర ఉంచుకోవాలి.

ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 మే 31

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 2023 జూన్​ 30

Last Updated : Jun 28, 2023, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details