తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IBPS SO Vacancy 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో 1402 పోస్టులు.. వేలల్లో జీతం.. అప్లై చేసుకోండిలా.. - ఐబీపీఎస్ ఎస్ఓ జాబ్స్ అప్లికేషన్​ ఫీజు

IBPS SO Vacancy 2023 : ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​) దేశంలోని వివిధ బ్యాంకుల్లోని పలు విభాగాల్లో ఉన్న స్పెషల్​ ఆఫీసర్​ ఖాళీలను భర్తీ చేసేందుకు భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మరి అవి ఏం పోస్టులు, ఎవరు అర్హులు, వాటి జీతభత్యాలు ఎలా ఉంటాయి, దరఖాస్తు చివరితేదీ ఎప్పుడు వంటి పూర్తి వివరాలు మీకోసం.

IBPS SO Vacancy 2023
IBPS SO Jobs 2023

By

Published : Aug 10, 2023, 11:00 AM IST

IBPS SO Vacancy 2023 : దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​). మొత్తం 1402 స్పెషల్​ ఆఫీసర్​ పోస్టుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. కేటగిరీల ఆధారంగా పోస్టులను కేటాయించిన ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తు​లను ఈనెల 1 నుంచి స్వీకరిస్తున్నారు.

మొత్తం ఖాళీలు..
IBPS Jobs 2023 :1402 పోస్టులు.

పోస్టులు వారీగా ఖాళీలు..

  • ఐటీ ఆఫీసర్​- 120
  • అగ్రికల్చర్​ ఫీల్డ్ ఆఫీసర్​(ఏఎఫ్​ఓ)- 500
  • రాజ్​భాషా అధికారి- 41
  • లా ఆఫీసర్- 10
  • హెచ్​ఆర్​/పర్సనల్​ ఆఫీసర్- 31
  • మార్కెటింగ్​ ఆఫీసర్​(ఎంఓ)- 700

దరఖాస్తు చివరితేదీ..
IBPS SO Last Date : 2023 ఆగస్టు 21

ప్రిలీమ్స్​ పరీక్ష తేదీలు..
IBPS SO Prelims :2023 డిసెంబర్​ 30,31

మెయిన్స్​​ ఎగ్జామ్​..
IBPS SO Mains :2024 జనవరి 28

దరఖాస్తు రుసుము..

  • జనరల్, ఓబీసీ- 850/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- 175/-

ఏజ్​ లిమిట్..
IBPS SO Age Limit :అభ్యర్థుల వయసు 20-30 ఏళ్లలోపు ఉండాలి.

వయోపరిమితి సడలింపులు..
IBPS SO Age Relaxation :ఐబీపీఎస్​ ఎస్​ఓ XIII రిక్రూట్​మెంట్​ రూల్స్( IBPS SO Eligibility ) ఆధారంగా వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు కల్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

జీతభత్యాలు..
IBPS SO Salary :రూ.34,000-రూ.40,000

విద్యార్హతలు..

ఐటీ ఆఫీసర్​

  • బ్యాచిలర్​ డిగ్రీలో బి లెవెల్​ సర్టిఫికేట్​ ఉండాలి.
  • బీటెక్​లో కంప్యూటర్​ సైన్స్​, కంప్యూటర్​ అప్లికేషన్స్​, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్​ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్​స్ట్రుమెంటేషన్​ లేదా మాస్టర్స్​ డిగ్రీ.

అగ్రికల్చర్​ ఫీల్డ్ ఆఫీసర్​(ఏఎఫ్​ఓ)
బీటెక్​-అగ్రికల్చర్​ సబ్జెక్ట్​ తప్పనిసరిగా ఉండాలి.

రాజ్​భాషా అధికారి
డిగ్రీలో తీసుకున్న సెకెండ్​ ల్యాంగ్వేజ్ (సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్​)​లో మాస్టర్స్​ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.

లా ఆఫీసర్
IBPS SO Educational Qualification :లా డిగ్రీ (3 లేదా 5 సంవత్సరాలు)

హెచ్​ఆర్​/పర్సనల్​ ఆఫీసర్
మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్​ పర్సన్నల్​ మేనేజ్​మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్​ఆర్​, హెచ్​ఆర్​డీ, సోషల్​ వర్క్​, లేబర్​ లా.

మార్కెటింగ్​ ఆఫీసర్​(ఎంఓ)
మాస్టర్స్​ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్​, పీజీడీబీఏ, పీజీడీబీఎమ్​, పీజీపీఎమ్​, పీజీడీఎమ్​.

అధికారిక వెబ్​సైట్​..
IBPS Website : పోస్టుల వారీగా సిలబస్​తో పాటు మిగతా వివరాల కోసం ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​ www.ibps.in​ను చూడండి.

ABOUT THE AUTHOR

...view details