తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐబీపీఎస్​ ఆర్​ఆర్​బీలో పెరిగిన పోస్టుల సంఖ్య - IBPS RRB PO admit card

ఐబీపీఎస్ ఆర్​ఆర్​బీ పీఓ పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వెల్లడించింది. అదే సమయంలో పరీక్షలకు సంబంధించిన అడ్మిట్​ కార్డును విడుదల చేసింది.

ibps, ibps rrb
ఐబీపీఎస్, ఐబీపీఎస్ ఆర్​ఆర్​బీ

By

Published : Jul 18, 2021, 8:30 PM IST

ఐబీపీఎస్ ఆర్​ఆర్​బీ స్కేల్​ 1 పోస్టుల సంఖ్యను పెంచింది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS). తొలుత 4,257 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్యను 4,716కు పెంచినట్లు పేర్కొంది.

ఇందుకోసం నిర్వహిస్తున్న పరీక్షకు తాజాగా అడ్మిట్​ కార్డులు విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 7 వరకు సంబంధిత ఎగ్జామ్స్ నిర్వహించనుంది.

ఐబీపీస్​ ఆర్​ఆర్​బీ పీఓ అడ్మిట్ కార్డు డౌన్​లోడ్​ చేసుకోండిలా..

Step1: అధికారిక వెబ్​సైట్​ ibps.in లోకి వెళ్లాలి.

Step 2: హోం పేజ్​ ఓపెన్ అయ్యాక స్క్రోలింగ్ అవుతున్న లింక్​పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.

Step 4: వివరాలు ఇచ్చి లాగిన్ అవ్వాలి.

Step 5: అడ్మిట్​ కార్డు ఓపెన్ అవుతుంది. డౌన్​లోడ్​ చేసుకోవాలి.

అభ్యర్థులు పరీక్ష హాలుకు అడ్మిట్​ కార్డు సహా ఓ ఐడీ ప్రూఫ్​ను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ఐబీపీఎస్ ఆర్​ఆర్​బీ ప్రిలిమ్స్ పరీక్షకు ఉత్తీర్ణులైనవారు సెప్టెంబర్​లో మెయిన్స్​ పరీక్షకు హాజరుకావాలి. ఆ తర్వాత ఇంటర్యూలో అర్హత సాధించాలి. ఈ ఉద్యోగం సంపాదించినవారికి నెల జీతం రూ. 30,000- రూ. 35,000 వరకు ఉంటుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details