IBPS PO Notification 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఐబీపీఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) శుభవార్త చెప్పింది. పీఓ/మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 11 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని మొత్తం 3049 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామక ప్రక్రియ చేపట్టినట్లు ప్రకటించింది.
ఇన్ని ఖాళీలు..
IBPS PO Vacancy 2023 : 3049 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు.
విద్యార్హత..
IBPS PO Education Eligibility : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
ఏజ్ లిమిట్..
IBPS PO Age Limit 2023 : 20-35 సంవత్సరాలు ఉండాలి. పీఓ హోదాలోని సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఐబీపీఎస్ నిబంధనల ప్రకారం కనిష్ఠ, గరిష్ఠ ఏజ్ లిమిట్‌ను నిర్దేశించారు. పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
జీతభత్యాలు..
IBPS PO Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.52,000-రూ.55,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు తేదీలు..
- ప్రారంభ తేదీ - 2023 ఆగస్టు 1
- చివరితేదీ - 2023 ఆగస్టు 21
ఎంపిక విధానం..
IBPS PO Selection Process 2023 : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. రాతపరీక్షల్లో వచ్చిన మార్కులను అనుసరించి ఓవరాల్ కటాఫ్‌ను నిర్ణయిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఈ అర్హతలు ఉంటే ప్రాధాన్యం..
- స్థానిక భాషపై పట్టు
- కంప్యూటర్ పరిజ్ఞానం
- అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చురల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ విభాగాల్లో చదివిన వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.