IBPS PO Jobs Apply Last Date : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లైకు ఆఖరు తేదీ ఆగస్టు 21. ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వైబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు..
- ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ - 3049ఖాళీలు
- స్పెషలిస్ట్ ఆఫీసర్ - 1402పోస్టులు
విద్యార్హతలు..
IBPS PO SO Education Eligibility : పీఓ పోస్టులకు దరఖాస్తు చేసే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్ఓ జాబ్స్‌కు అప్లై చేసుకోవాలనుకునే వారు కచ్చితంగా సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితులు..
IBPS PO SO Age Limit : అభ్యర్థుల వయసు 20-35 ఏళ్లలోపు ఉండాలి. ఐబీపీఎస్ నిబంధనల ప్రకారం పీఓ, ఎస్ఓ పోస్టులకు వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ( IBPS SO Age Relaxation ) ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
జీతభత్యాలు..
IBPS PO SO Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.34,000 నుంచి రూ.55,000 వరకు వేతనాలు ఉంటాయి.
దరఖాస్తు ఆఖరు తేదీ..
- అభ్యర్థులు 2023 ఆగస్టు 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
IBPS PO And SO Selection Process 2023 : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. రాతపరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఓవరాల్ కటాఫ్ నిర్ణయిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.