తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Bank jobs 2023 : ఐబీపీఎస్​ భారీ నోటిఫికేషన్​.. పోస్టులు, దరఖాస్తు వివరాలు ఇలా..

IBPS CRP RRB recruitment 2023 : బ్యాంకింగ్​ రంగంలో స్థిరపడాలనుకుంటున్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం వచ్చింది. గ్రామీణ బ్యాంకుల్లో 8,612 ఆఫీసర్​, ఆఫీస్​ అసిస్టెంట్​ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్​ వెలువడింది. నోటిఫికేషన్​ పూర్తి వివరాలు మీ కోసం..

IBPS CRP RRB XII NOTIFICATION 2023
IBPS CRP RRB NOTIFICATION 2023

By

Published : Jun 2, 2023, 1:42 PM IST

IBPS CRP RRB notification :ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. (IBPS) గ్రామీణ బ్యాంకుల్లో అంటే రీజినల్​ రూరల్​ బ్యాంకుల్లో కామన్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ ద్వారా ఖాళీలను భర్తీ చేయనుంది. బ్యాంకింగ్​ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులను ఇది సువర్ణ అవకాశం అనే చెప్పాలి.

భారీ స్థాయిలో పోస్టులు?
ఐబీపీఎస్​ కామన్​ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ - XII ద్వారా 8612 గ్రూప్​ ఎ ఆఫీసర్​ (స్కేల్​ 1, 2, 3) పోస్టులను, గ్రూప్​ బి - ఆఫీస్​ అసిస్టెంట్​ (మల్టీ పర్పస్​) పోస్టులను భర్తీ చేయనుంది.

  • ఆఫీస్​ అసిస్టెంట్​ (మల్టీపర్పస్) - 5538 పోస్టులు
  • ఆఫీసర్​ స్కేల్​ 1 (ఏఎం) - 2485 పోస్టులు
  • జనరల్​ బ్యాంకింగ్​ ఆఫీసర్​ (మేనేజర్​) స్కేల్​ 2 - 332 పోస్టులు
  • ఐటీ ఆఫీసర్​ స్కేల్​ 2 - 68 పోస్టులు
  • ఆగ్రికల్చర్​ ఆఫీసర్​ స్కేల్​ 2 - 60 పోస్టులు
  • ఆఫీసర్​ స్కేల్​ 3 (సీనియర్​ మేనేజర్​) - 73 పోస్టులు
  • సీఏ ఆఫీసర్​ స్కేల్​ 2 -21 పోస్టులు
  • లా ఆఫీసర్​ స్కేల్​ 2 - 24 పోస్టులు
  • ట్రెజరీ మేనేజర్​ స్కేల్​ 2 - 8 పోస్టులు
  • మార్కెటింగ్​ ఆఫీసర్​ స్కేల్​ 2 - 3 పోస్టులు ​

IBPS qualifications: విద్యార్హతలు, వయోపరిమితి ఏమిటి?
ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులకు బ్యాచిలర్​ డిగ్రీ, ఎంబీఏ, లా, సీఎ లాంటి విద్యార్హతలు ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే..

  • ఆఫీసర్​ స్కేల్​ 3 (సీనియర్​ మేనేజర్​)లకు 21 నుంచి 40 ఏళ్లు
  • ఆఫీసర్​ స్కేల్​ 2 (మేనేజర్​) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు
  • ఆఫీసర్​ స్కేల్​ 1 (అసిస్టెంట్​ మేనేజర్​) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు
  • ఆఫీస్​ అసిస్టెంట్​ (మల్టీపర్పస్​) పోస్టులకు 18 నుంచి 28 ఏళ్లు

IBPS exam pattern :పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ఆన్​లైన్​లో మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. తరువాత మెయిన్​​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్​ కూడా ఉంటుంది.

దరఖాస్తు గడువు, పరీక్ష తేదీల వివరాలు:
IBPS CRP RRB పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈ 2023 జూన్​ 1న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూన్​ 21లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IBPS exam dates :

⦁ ప్రిలిమినరీ పరీక్ష: 2023 ఆగస్టు

⦁ మెయిన్​ పరీక్ష: 2023 సెప్టెంబర్​

ఇంటర్వ్యూ తేదీలు:

  • ఆఫీసర్​ స్కేల్​ 1, 2 ,3 లకు: 2023 అక్టోబర్​/ నవంబర్​ 2023
  • ప్రొవిజనల్​ అలాట్​మెంట్​: 2024 జనవరిలో ఉంటాయి.

దరఖాస్తు రుసుము ఎంత?

  • ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175/-
  • మిగతా అభ్యర్థులకు రూ.850/-
  • పూర్తి వివరాలకు IBPS అధికారిక వెబ్​సైట్​ను సందర్శించగలరు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details