తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IBPS Jobs : క్లర్క్​ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు.. 5 రోజులే ఛాన్స్​.. పెరిగిన 500 పోస్టులు!

IBPS Jobs 2023 : దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు తేదీని పొడిగించింది ఐపీబీఎస్​. అర్హులైన అభ్యర్థులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

IBPS Exam Date Extended Till July 28th
బ్యాంక్​ క్లర్క్​ పోస్టుల దరఖాస్తు తేదీ పొడిగింపు.. 5 రోజులే ఛాన్స్​.. పెరిగిన 500 పోస్టులు..

By

Published : Jul 23, 2023, 2:48 PM IST

Bank Jobs 2023 : బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని వివిధ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​). అర్హులైన అభ్యర్థులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 21తో దరఖాస్తు చివరితేదీ ముగియగా.. తాజాగా ఆ గడువును జులై 28 వరకు పొడిగించారు. ఆసక్తి గల ఉద్యోగార్థులు జులై 28లోపు https://www.ibps.in/ వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తొలుత మొత్తం 4045 క్లర్క్‌ పోస్టులకే ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన IBPS.. మరో 500 పోస్టులను పెంచుతూ మొత్తం 4545 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. కామన్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు..
IBPS Clerk Eligibility : అభ్యర్థులు డిగ్రీ పట్టాతో పాటు కచ్చితంగా కంప్యూటర్​ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఏజ్​ లిమిట్..
IBPS Clerk Age limit : అభ్యర్థులు 2023 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం పలు కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్​ ఫీజు..

  • IBPS Clerk Exam Fee : జనరల్ కేటగిరీ అభ్యర్థులు- రూ.850/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.175/-

ఎంపిక విధానం..
Bank Jobs Selection Process : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశల్లో కంప్యూటర్​ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్​ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాయడానికి అర్హులు. కాగా, మెయిన్స్​ 200 మార్కులకు ఉంటుంది.

  • దరఖాస్తు చివరితేదీ : 2023, జులై 28
  • ప్రిలిమినరీ పరీక్ష : 2023 ఆగస్టు లేదా సెప్టెంబర్​లో నిర్వహిస్తారు.
  • మెయిన్స్​ పరీక్ష : 2023 అక్టోబర్​లో జరుగుతుంది.

పరీక్ష విధానం..
IBPS Jobs Syllabus : ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్​ గ్రామర్​కు సంబంధించిన ప్రశ్నలు 30, క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ 35 ప్రశ్నలు, రీజనింగ్​ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం కేవలం 1 గంట మాత్రమే. మెయిన్స్​ పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్​ గ్రామర్​ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్​ ఆప్టిట్యూడ్​ 50 ప్రశ్నలు, రీజనింగ్​ ఎబిలిటీ 50 ప్రశ్నలు, జనరల్ అవేర్​నెస్​ 50 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్​ పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.

ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నాపత్రం..
IBPS Clerk Exam Language : ఐబీపీఎస్ ప్రిలిమ్స్​, మెయిన్స్​ పరీక్షలను ఇంగ్లీష్​ సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. మల్టిపుల్​ ఛాయిస్​ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ పరీక్షల్లో నెగిటివ్​ మార్కింగ్​ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

ఈ బ్యాంకుల్లో పోస్టింగ్​..
Bank Jobs 2023 : ఐబీపీఎస్​ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను బ్యాంక్​ ఆఫ్​ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్​ ఓవర్సీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, పంజాబ్​ నేషనల్​ బ్యాంకు, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్​ బ్యాంకు, పంజాబ్​ అండ్ సింధ్​ బ్యాంకుల్లో నియమిస్తారు.

పూర్తి వివరాల కోసం..
IBPS Website : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​ను వీక్షించొచ్చు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details