తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐబీపీఎస్​' నోటిఫికేషన్​ వచ్చేసింది.. వేల ఉద్యోగాలు.. మంచి జీతం! - ఐబీపీఎస్​ ఉద్యోగాలు

IBPS Clerk Recruitment: నిరుద్యోగులకు ఐబీపీఎస్​ గుడ్​న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7000 క్లర్క్​ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు బుధవారం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? విద్యా అర్హతలు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.

IBPS Clerk Recruitment 2022
IBPS Clerk Recruitment 2022

By

Published : Jun 30, 2022, 1:17 PM IST

IBPS Clerk Recruitment: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి.. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్​ పర్సనల్​ సెలక్షన్​(ఐబీపీఎస్​) శుభవార్త చెప్పింది. తాజాగా 7000 క్లర్క్​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్​లో పేర్కొంది.

మరో గుడ్​ న్యూస్ ఏమిటంటే.. ఈ పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ ఉండనుంది. ఆయా రాష్ట్రాలను బట్టి ఇంగ్లీష్​, హిందీతో పాటు.. మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది. క్లర్క్​ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్​లైన్​ ద్వారా జరగనుందని ఐబీపీఎస్​ పేర్కొంది. ఎంపిక విధానం ప్రిలిమ్స్​, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల ప్రారంభం : 01-07-2022
  • దరఖాస్తులకు చివరితేదీ : 21-07-2022
  • ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్​ కాల్​లెటర్ ​: 2022 ఆగస్టు
  • ప్రి ఎంట్రెన్స్​ టెస్ట్​ : 2022 ఆగస్టు
  • ప్రిలిమ్స్​ కాల్​లెటర్​ డౌన్​లోడ్ ​: 2022 ఆగస్టు
  • ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ : 2022 సెప్టెంబర్​
  • ప్రిలిమ్స్​ ఫలితాలు : 2022 సెప్టెంబర్​/అక్టోబర్​
  • మెయిన్స్​ ఎగ్జామ్ ​ : 2022 అక్టోబర్​
  • తుది ఫలితాలు : 2023 ఏప్రిల్​

ప్రిలిమ్స్​ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్​లో 30, న్యూమరికల్​ అబిలిటీ 35, రీజనింగ్​ అబిలిటీ 35 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షకు గంట సేపు ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి కటాఫ్​ను బట్టి మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. మెయిన్స్​లో మొత్తం 190 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది. దీంట్లో కటాఫ్​ను బట్టి నేరుగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

అర్హతలు..
ఏదైనా డిగ్రీ పట్టా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్​ ఉండాలి. లేదా డిగ్రీలో ఏదైనా కంప్యూటర్​ సబ్జెక్ట్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు. రిజర్వేషన్​ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.

వేతనం:ఐబీపీఎస్​ క్లర్క్​ పోస్టులకు ఎంపికైన వారికి ఇది రూ. 19,900- 47,920 వరకు వేతనం ఉంటుంది. డీఏ, హెచ్​ఆర్​ఏ, మెడికల్​, ట్రాన్స్​పోర్ట్​ సహా ఇతర అలవెన్సులు మినహాయించి .. అప్పుడే ఉద్యోగంలో చేరినవారికి రూ. 29,453 వేతనం చేతికి అందుతుంది.

అప్లై చేయాలంటే..

1. ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.

2. హోం పేజీలో 'Apply for Bank Clerks' పై క్లిక్​ చేయాలి..

3. రిజిస్ట్రేషన్​ ఆప్షన్​పై క్లిక్​ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి.

4. అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపి.. కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్​ చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొడనవేలి ముద్ర, రాతపూర్వక డిక్లరేషన్​ వంటివి స్కాన్​ చేసి అప్లోడ్​ చేయాల్సి ఉంటుంది.

5. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. ఓ కాపీని భవిష్యత్​ అవసరాల కోసం సేవ్​ చేసుకోవాలి.

ఫీజు ఎంత?

  • రిజర్వేషన్ లేని అభ్యర్థులు(జనరల్​, ఇతరులు) రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. రిజర్వేషన్​ ఉన్న వాళ్లు(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు) రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్​సైట్లో పూర్తి వివరాలను క్షణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయడం ఉత్తమం.

ఇదీ చదవండి:నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఎన్పీడీసీఎల్​ నోటిఫికేషన్​ విడుదల..

సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం రూ.60 వేలకుపైనే

ABOUT THE AUTHOR

...view details