IBPS Clerk Notification 2023 : నిరుద్యోగుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా 4,045 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో నియమించనుంది.
విద్యార్హతలు
IBPS Clerk Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి
IBPS Clerk Age limit : అభ్యర్థుల వయస్సు 2023 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీలను అనుసరించి వయోపరిమితి సడలింపులు కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
Bank Jobs Selection Process : అభ్యర్థులకు రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిక పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాయడానికి అనుమతి ఇస్తారు. మెయిన్స్ 200 మార్కులకు ఉంటుంది.
పరీక్ష విధానం
IBPS Clerk Exam Pattern : ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ గ్రామర్కు సంబంధించిన ప్రశ్నలు 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం కేవలం 1 గంట మాత్రమే. మెయిన్స్ పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. ఇంగ్లిష్ గ్రామర్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం 2.40 గంటలు.
ఈ ఐబీపీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఇంగ్లిష్ సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
ఏయే బ్యాంకుల్లో ఉద్యోగాలు
Bank Jobs 2023 : ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో నియమిస్తారు.
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 జులై 1
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 జులై 21
- ప్రిలిమినరీ పరీక్ష : 2023 ఆగస్టు లేదా సెప్టెంబర్ల్లో నిర్వహిస్తారు.
- మెయిన్స్ పరీక్ష : 2023 అక్టోబర్లో జరుగుతుంది.
IBPS Clerk Jobs 2023 : ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.