IB JIO Recruitment 2023 :నిరుద్యోగులకు శుభవార్త. ఇంటెలిజెన్స్ బ్యూరో భారీ స్థాయిలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 797 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ 2023 జూన్ 3 నుంచే ప్రారంభమైంది. జూన్ 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వైబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల - మే 30, 2023
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం - జూన్ 3, 2023
- దరఖాస్తుకు చివరి తేదీ - జూన్ 23, 2023
- ఆన్లైన్ పేమెంట్‌కు చివరి తేదీ - జూన్ 27, 2023
వయో పరిమితి
ఐబీ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
విద్యార్హతలు
అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో లేదా విద్యా సంస్థల్లో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్‌ల్లో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్ లాంటి స్పెషలైజేషన్స్ చేసి ఉండాలి. అది కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థలో చదివి ఉండాలి.
కేటగిరిల వారీగా పోస్టులు
- UR (అన్ రిజర్వ్డ్) - 325
- EWS (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్) -79
- OBC - 215
- SC - 119
- ST - 59
- మొత్తంగా 797 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి?
- స్టెప్ 1: అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in/en ను ఓపెన్ చేయాలి
- స్టెప్ 2: రిక్రూట్మెంట్ లేదా కెరీర్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి
- స్టెప్ 3: జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
- స్టెప్ 4: నోటిఫికేషన్లో పొందుపరిచిన వివరాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు లాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి.
- స్టెప్ 5: అప్లై ఆన్లైన్ లేదా రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తు నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
- స్టెప్ 6: దరఖాస్తులో నింపిన వివరాలు మరోసారి సరిచూసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే పరీక్ష ఫీజు చెల్లించి, అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.
ఇవీ చదవండి: