IB ACIO Jobs 2023 : మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
IB ACIO Job Details :అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - గ్రేడ్ II ఎగ్జిక్యూటివ్
- యూఆర్ - 377 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 129 పోస్టులు
- ఓబీసీ - 222 పోస్టులు
- ఎస్సీ - 134 పోస్టులు
- ఎస్టీ - 133 పోస్టులు
- మొత్తం పోస్టులు - 995
విద్యార్హతలు
IB ACIO Qualifications :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
IB ACIO Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 డిసెంబర్ 15 నాటికి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
IB ACIO Application Fee :
- అభ్యర్థులు అందరూ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.450 చెల్లించాలి. దీనికి తోడు..
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (పురుషులు) అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక ప్రక్రియ
IB ACIO Selection Process :అభ్యర్థులకు ముందుగా టైర్-1, టైర్-2 పరీక్షలను నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
జీతభత్యాలు
IB ACIO Salary :అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందిస్తారు.