తెలంగాణ

telangana

IAS Officers Dog Walking : కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ చేయించిన IASపై వేటు.. బలవంతంగా పదవీ విరమణ

IAS Officers Dog Walking : క్రీడాకారులు సాధన చేసే మైదానాన్ని తన కుక్కతో కలిసి వాకింగ్‌ చేసుకోవడానికి వినియోగించిన ఐఏఎస్‌ అధికారిపై వేటుపడింది. సదరు అధికారితో ప్రభుత్వం బలవంతంగా రాజీనామా చేయించింది.

By PTI

Published : Sep 27, 2023, 5:15 PM IST

Published : Sep 27, 2023, 5:15 PM IST

IAS Officers Dog Walking
IAS Officers Dog Walking

IAS Officers Dog Walking :స్టేడియం ఖాళీ చేయించి పెంపుడు కుక్కతో వాకింగ్ చేసిన ఐఏఎస్​ అధికారిపై వేటు పడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణాచల్​ప్రదేశ్​ IAS అధికారిణి రింకూ దుగ్గాను పదవీ విరమణ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారుల ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ పెన్షన్‌ నిబంధనల కింద ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాను కోరుకొన్న ఉద్యోగిని ముందస్తుగా పదవీ విరమణ చేయించే హక్కుంది. కాగా, రింకూ ప్రస్తుతం అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇండీజీనియస్‌ అఫైర్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నారు.

ఇదీ జరిగింది
IAS Dog Walk In Stadium : దిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియం రాత్రి 7గంటల వరకు క్రీడాకారులు, శిక్షకులతో సందడిగా ఉంటుంది. అయితే, అప్పట్లో దిల్లీ రెవెన్యూ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న దిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్‌ మాత్రం.. ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేసేందుకు ఉపయోగించుకున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం రాత్రి 7గంటల కంటే ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి పంపాలని నిర్వాహకులకు ఆదేశించారు. అనంతరం అరగంట తర్వాత తన భార్య రింకూతో కలిసి పెంపుడు శునకంతో చేరుకుని వాకింగ్‌ చేసుకునేవారు. ఈ ఐఏఎస్‌ నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఐఏఎస్‌ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని అప్పట్లో క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇద్దరిని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ
ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం వల్ల గతేడాది మే నెలలో ప్రభుత్వం స్పందించింది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై దిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ దంపతుల​ను బదిలీ చేసింది. AGMUT క్యాడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఐఏఎస్​ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్​కు, ఆయన భార్య రింకూ దుగ్గాను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది హోం మంత్రిత్వ శాఖ. తాజాగా ఇప్పుడు వారిలో రింకూపై చర్యలు తీసుకుంది.

పెంపుడు కుక్కతో వాకింగ్‌.. ఐఏఎస్‌ కోసం స్టేడియం ఖాళీ.. కేంద్రం సీరియస్​!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ కుక్క ఇదే.. ఏజ్​ ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details