తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఏఎస్​ ఇంట్లో 12 కిలోల గోల్డ్.. సోదాలు చేస్తుండగా కాల్పులు.. కుమారుడు మృతి.. ఏం జరిగింది?

IAS son shot himself: ఐఏఎస్ అధికారి కుమారుడు బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి అవినీతి కేసులో అరెస్టయ్యారు. అధికారి ఇంట్లో సోదాలు జరుగుతున్నప్పుడే కాల్పులు జరగడం.. ఆయన కుమారుడు చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. అది ఆత్మహత్యే అని అధికారులు చెప్తున్నా.. కుటుంబసభ్యులు దీనిని ఖండించారు. అధికారులే తమ కుమారుడిని చంపేశారని సంజయ్​ భార్య ఆరోపించారు.

Punjab IAS son suicide
Punjab IAS son suicide

By

Published : Jun 25, 2022, 4:30 PM IST

Updated : Jun 26, 2022, 10:40 AM IST

Punjab IAS son suicide: పంజాబ్​ ఐఏఎస్​ అధికారి సంజయ్​ పోప్లి నివాసంలో విజిలెన్స్​ అధికారులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో అక్కడ జరిగిన పరిణామాలే అందుకు కారణం. ఓ వైపు అధికారులకు బంగారం, వెండి సహా అక్రమంగా నిలువ చేసిన వస్తువులు లభ్యం కాగా.. సోదాలు జరుగుతున్న సమయంలోనే ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఆయన కుమారుడు కార్తిక్​ పోప్లి (27) అనుమానస్పద రీతిలో చనిపోయాడు. తనిఖీ చేయగా.. కార్తిక్ తనను తాను కాల్చుకొని చనిపోయాడని తేలిందని అంటున్నారు. లైసెన్స్​డ్ షాట్​గన్​తో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్తున్నారు.

అయితే, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను ఖండించారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని సంజయ్ భార్య ఆరోపించారు. 'వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు స్టేట్​మెంట్లు ఇవ్వాలని మా ఇంట్లోని పనివాళ్లపైనా ఒత్తిడి చేస్తున్నారు. నా కుమారుడు చాలా మంచి లాయర్. తప్పుడు కేసు కోసం నా కుమారుడిని కిడ్నాప్ చేశారు. వారే చంపేశారు. దీనికి భగవంత్ మాన్(పంజాబ్ సీఎం) సమాధానం చెప్పాల్సిందే. దీనిపై నేను కోర్టుకు వెళ్తా' అని భావోద్వేగంతో అన్నారు. 'సంజయ్ కోర్టులో హాజరుకావాల్సిన సమయంలోనే విజిలెన్స్ అధికారులు మా ఇంటికి వచ్చారు. కార్తిక్​ను (మృతుడు) పైకి తీసుకెళ్లారు. నేను పైకి వెళ్లి చూస్తే.. కార్తిక్​ను మానసికంగా హింసించడం చూశా. ఆరోపణలను ఒప్పుకోవాలని హింసించారు. మా ఫోన్లనూ లాగేసుకున్నారు. నా కుమారుడిని గంటలపాటు బంధించారు. ఇప్పుడు కార్తిక్ చనిపోయాడు. సాక్ష్యాలు దొరకకపోతే వీరు ఎవరినైనా చంపేస్తారు' అని సంజయ్ భార్య ఆరోపించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం, స్మార్ట్​ఫోన్లు
బంగారం
.

ప్రస్తుతం సంజయ్ పోప్లి జైలులో ఉన్నారు. ఓ ప్రభుత్వ ప్రాజెక్టు కాంట్రాక్టులకు అనుమతులు జారీ చేసేందుకు లంచం అడిగారన్న ఆరోపణలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టు విలువ రూ.ఏడు కోట్లు కాగా.. ఒక శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు స్థానిక కాంట్రాక్టర్ ఆరోపించారు. ఈ మేరకు సంజయ్​పై కేసు పెట్టారు.

అవినీతి కేసులో జూన్ 21న సంజయ్ అరెస్టు కాగా.. విజిలెన్స్ అధికారుల బృందం విచారణ నిమిత్తం చండీగఢ్​లోని ఆయన ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో 12 కిలోల బంగారం, మూడు కిలోల వెండి దొరికాయి. వీటిలో కిలో బరువు ఉండే తొమ్మిది బంగారు ఇటుకలు, 49 బంగారం బిస్కెట్లు, 12 బంగారం నాణేలు సహా కిలో బరువు ఉండే 3 వెండి ఇటుకలు, 10 గ్రాములు విలువ చేసే 18 వెండి నాణేలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఖరీదైన స్మార్ట్​ఫోన్లు, వాచీలను సంజయ్ ఇంట్లో గుర్తించారు. సంజయ్​పై ఆయుధాల చట్టం ప్రకారం మరో కేసు పెట్టారు. అనుమతులు లేకుండా క్యాట్రిడ్జ్​లు ఇంట్లో ఉంచుకున్నారనే ఆరోపణలు మోపారు. తనిఖీల్లో భాగంగా ఆయన ఇంట్లో 70 క్యాట్రిడ్జ్​లు గుర్తించారు. ఇవేవీ లెక్కల్లో చూపలేదు.

.
.

ఇదీ చదవండి:

Last Updated : Jun 26, 2022, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details