తెలంగాణ

telangana

ETV Bharat / bharat

56వ సారి బదిలీ అయిన ఐఏఎస్​ అధికారి.. ఆ లేఖ రాయడం వల్లేనా? - ashok khemka transfered to acs archives

ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్ అధికారి అని పేరున్న అశోక్‌ ఖేమ్కా మరోసారి ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఈ బదిలీ కారణం ఆయన రాసిన ఓ లేఖే కారణమని తెలుస్తోంది. కాగా, అశోక్​కు ఇది 56వ బదిలీ.

IAS ashok khemka TRANSFER
IAS ashok khemka TRANSFER

By

Published : Jan 10, 2023, 7:05 AM IST

ఎక్కువ సార్లు బదిలీ అయ్యే ఐఏఎస్‌ అధికారిగా పేరున్న అశోక్‌ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం హరియాణా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాతో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్‌) శాఖకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 30 ఏళ్ల కెరీర్‌లో ఖేమ్కాకు ఇది 56వ బదిలీ.

ఉత్తర్వుల్లో పేర్కొనకపోయినప్పటికీ.. కొన్ని రోజుల క్రితం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)కి రాసిన లేఖ దీనికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో పని లేకుండా పోయిందని ఖేమ్కా ఆ లేఖలో పేర్కొన్నారు. తన స్థాయి అధికారికి వారానికి కనీసం 40 గంటల పని ఉండాలని సీఎస్‌కు సూచించారు. తన కెరీర్‌లో ఎక్కువ సార్లు అప్రాధాన్య పోస్టుల్లోనే కొనసాగిన ఖేమ్కా ఆర్కైవ్స్‌ శాఖలో పనిచేయడం ఇది నాలుగోసారి.

ABOUT THE AUTHOR

...view details