CDS helicopter crash reason: త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించడానికి ట్రై-సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ప్రకటించింది. విచారణ త్వరితగతిన పూర్తై.. వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
"హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధించడానికి ట్రై-సర్వీస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేశాం. విచారణ త్వరగా పూర్తై.. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు మరణించిన వ్యక్తి గురించి, ప్రమాదం గురించి ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వవద్దు."
-భారత వైమానిక దళం
ఐఏఎఫ్ సహా స్థానిక పోలీసు బృందాలు శుక్రవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన కూనూర్‌లోని నంజప్ప చత్రమ్ గ్రామం వద్దకు చేరుకుని దర్యాప్తు నిర్వహించాయి.
నంజప్ప చత్రమ్ గ్రామంలో పోలీసులు, ఐఏఎఫ్ బృందాలు ఘటనాస్థలిలో దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు పోలీసులు, ఐఏఎఫ్ బృందాల దర్యాప్తు ఘటనాస్థలిలో దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు కొనసాగుతున్న దర్యాప్తు..
Investigation on cds helicopter crash: హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం.. కూనూర్‌లోని కట్టారీ పార్క్‌లో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ బృందానికి ఎయిర్ చీఫ్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. ఘటనాస్థలిలో వాతావరణ పరిస్థితులను, ప్రమాదానికి కారణాలను విశ్లేషించేందుకు డ్రోన్లను ఈ బృందం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఫ్లైట్ డేటా రికార్డర్‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై పూర్తి స్థాయి విశ్లేషణ చేసి, రక్షణ మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించనుంది. అయితే.. ఫ్లైట్ డేటా రికార్డర్లో లభ్యమైన పెన్డ్రైవ్లోని సమచారాన్ని విశ్లేషించడం సాధ్యం కాకపోతే.. రష్యా రక్షణ శాఖ నిపుణుల సాయాన్ని ఈ ప్రత్యేక బృందం కోరనుందని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి.
CDS General helicopter crash: తమిళనాడులోని కోయంబత్తూర్-కూనూర్ మధ్యలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ బుధవారం దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మందికిగాను 13 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.
ఇదీ చూడండి:హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం
ఇదీ చూడండి:Bipin Rawat: 'అగ్గిపెట్టె' సమాధానంతో ఆర్మీలో చేరిన రావత్..!