రఫేల్ యుద్ధ విమానాల రెండో స్క్వాడ్రన్‌ను బంగాల్లోని హాసిమారా వైమానిక స్థావరంలో వచ్చే నెల మధ్యలో ఏర్పాటు చేసేందుకు భారత వైమానిక దళం రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. తొలి స్క్వాడ్రన్ రఫేల్ యుద్ధ విమానాలను అంబాలా వైమానికదళ స్టేషన్లో ఉంచారు.
హాసిమారాలో 'రఫేల్' రెండో స్క్వాడ్రన్ - రఫేల్ స్థావరాలు
బంగాల్లోని హాసిమారా వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాల రెండో స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేసేందుకు వైమానిక దళం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు 11 రఫేల్‌లు భారత్ చేరుకోగా కొద్ది నెలల్లో మరిన్ని వచ్చే అవకాశం ఉంది.
హాసిమారాలో 'రఫేల్' రెండో స్క్వాడ్రన్
ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. వీటిలో తొలి బ్యాచ్‌గా గతేడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయి. సెప్టెంబరు 10న అంబాలాలో వీటిని చేర్చారు. అనంతరం వరుసగా నవంబరు 3న, జనవరి 21న రెండు, మూడు బ్యాచుల్లో 3 చొప్పున యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చాయి. కొద్ది నెలల్లో మరిన్ని రఫేల్ యుద్ధవిమానాలు వచ్చే అవకాశం ఉంది. ఒక స్క్వాడ్రన్‌లో దాదాపు 18 యుద్ధ విమానాలుంటాయి.
ఇదీ చదవండి :పిల్లల బొమ్మలతో 'రఫేల్' జెట్స్‌కు ముప్పు!