సరిహద్దుల్లో డ్రోన్ దాడులు కలకలం సృష్టిస్తున్న తరుణంలో వాటి కట్టడికి భారత వైమానిక దళం సమాయత్తమవుతోంది. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను సేకరించే ప్రక్రియ ప్రారంభించింది.
డ్రోన్ దాడులకు చెక్ పెట్టేలా సైన్యం కీలక నిర్ణయం
డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం సిద్ధమైంది. 10 మానవరహిత ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
యాంటీ డ్రోన్ వ్యవస్థలు
ఈ యాంటీ-డ్రోన్ వ్యవస్థలో లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థ ఉండాలని, దానిని దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించింది. ఈ వ్యవస్థలను వివిధ స్థావరాల్లో మోహరించాలని వైమానిక దళం తీర్మానించింది.
ఇదీ చూడండి:DRDO CHAIRMAN: కౌంటర్ డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్లు నాశనం