IAF Jobs 2024 : రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాల కోసం నోటిషికేషన్‌ను విడుదల చేసింది. అగ్నివీర్ వాయు(01/ 2025) పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాల వివరాలు
Agniveer Vayu Vacancy 2024 :
అర్హతలు
- మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2). కనీసం 50 శాతం మార్కుల ఉత్తీర్ణత సాధించాలి.
- సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులతో కూడిన ఇంటర్మీడియట్
- ఇంటర్ వొకేషనల్
- మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- వీటిల్లో ఏ విభాగంలోనైనా మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.
- తత్సమాన ఉత్తీర్ణత.
- నిర్దిష్ట శారీరక దారుఢ్య లేదా వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
- వివాహం కాని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఏజ్ లిమిట్
IAF Jobs 2024 Age Limit :గరిష్ఠ వయసు 21 ఏళ్లు. అభ్యర్థులు 2004 జనవరి 02 నుంచి 2007 జులై 02 మధ్య జన్మించి ఉండాలి.
ఎత్తు ఇంత ఉండాలి
IAF Jobs 2024 Height Limit :
- పురుషులు 152.5 సెంటిమీటర్లు
- మహిళలు 152 సెం.మీలు.
పరీక్ష ఫీజు
IAF Jobs 2024 Exam Fees :అభ్యర్థులు రూ.550 పరీక్ష రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
IAF Jobs 2024 Selection Process :
- ఫేజ్-1
రాత పరీక్ష(ఆన్‌లైన్) - ఫేజ్-2
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్