CDS chopper crash inquiry report: భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాప్టర్ ప్రమాదంపై ట్రై సర్వీస్ దర్యాప్తు నివేదికను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందించింది వాయుసేన. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా వివరించినట్లు అధికావర్గాలు తెలిపాయి.
ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్‌తో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో విచారణ బృందం చాపర్ క్రాష్‌పై దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలను నివేదికలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అలాగే, వీఐపీల కోసం భవిష్యత్తులో ఉపయోగించే చాపర్ ప్రయాణాలకు పలు సిఫార్సులను సైతం నివేదికలో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.
ప్రమాదం ఇలా..