IAF fighter plane: కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం- పైలట్ మృతి - వాయుసేన
21:37 December 24
IAF fighter plane: కుప్పకూలిన మిగ్-21 యుద్ధ విమానం
IAF fighter plane: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం మిగ్-21 రాజస్థాన్లోని జైసల్మేర్లో శుక్రవారం రాత్రి కూలిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతిచెందినట్లు పేర్కొన్నారు.
సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిసర్ట్ జాతీయ పార్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ వెల్లడించారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, తాను కూడా వెళుతున్నట్లు చెప్పారు.