IAF Chopper Airlifts Damaged Helicopter : భారత వాయుసేన అత్యంత క్లిష్టమైన, సవాల్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఔరా అనిపించింది. హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌తో ఎయిర్‌లిఫ్ట్ చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమర్‌నాథ్ యాత్ర కాగా.. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రను దృష్టిలో ఉంచుకొని హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. అయితే అమర్‌నాథ్ యాత్రికులను తరలించే ఓ ప్రైవేటు హెలికాప్టర్.. సాంకేతిక సమస్యతో పంచతరణి హెలిప్యాడ్‌లో నిలిచిపోయింది. దీంతో హెలికాప్టర్ సేవలు నిలిచిపోయాయి.
అమర్‌నాథ్ దేవస్థానం సమీపంలో కొన్నివేల మీటర్ల ఎత్తులో ఉన్న పంచతరణి హెలిప్యాడ్ వద్ద నిలిచిపోయిన హెలికాప్టర్‌ను తరలించేందుకు వాయుసేన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ చేపట్టింది. భక్తులను తరలించే AS-350 ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎంఐ-17 రవాణా హెలికాప్టర్ సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసింది. 11వేల 5వందల మీటర్ల ఎత్తు నుంచి నిటారుగా ఉన్న పర్వతాలు, ఇరుకైన లోయలతో అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు వాయుసేన ప్రకటించింది. పైలెట్ ఎంతో నైపుణ్యంతో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పని పూర్తి చేసినట్లు వివరించింది.
తమ బృందం పక్కా ప్రణాళిక, క్రమబద్ధమైన సన్నద్ధత, అసాధారణమైన ఫ్లయింగ్ నైపుణ్యాలతో.. ప్రైవేటు హెలికాప్టర్‌ను ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు వాయుసేన పేర్కొంది. ప్రైవేటు హెలికాప్టర్‌ను వాయుసేన హెలికాప్టర్ లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలు చూపరులను అబ్బురపరిచాయి. ఆ దృశ్యాలను వాయుసేన విడుదల చేసింది. అమర్‌నాథ్ దేవస్థానం సమీపంలోని పంచతరణి హెలిప్యాడ్ నుంచి పాడైన హెలికాప్టర్‌ను తరలించటం వల్ల హెలికాప్టర్ సేవలు తిరిగి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
నీలాకాశంలో ఫైటర్ జెట్స్ వాయుసేన అద్భుత విన్యాసాలు..
In Azadi Ka Amrit Mahotsav IAF Airshow : 2023 ఫిబ్రవరిలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ మెయింటెనెన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ ఎయిర్‌షోను నిర్వహించింది మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో భారత వైమానిక దళం. సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం, సరోంగ్ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎయిర్ డిస్‌ప్లే బృందాలు, గెలాక్సీ బృందాలు, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందాలు చేసిన ప్రదర్శనలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. ఇవే కాకుండా పారా హ్యాంగ్ గ్లైడింగ్, రవాణా, యుద్ధ విమానాలు ఫ్లై పాస్ట్ విన్యాసాలు చేపట్టాయి. ఆ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.