పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిపి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారత వైమానిక దళం సన్నద్ధత పరీక్షలను నిర్వహించింది. శత్రు స్థావరంపై దాడి జరిపినప్పుడు చేపట్టే విధంగా దిల్లీలో యుద్ధ విమానాలతో విన్యాసాలను నిర్వహించింది.
బాలాకోట్ దాడులకు రెండేళ్లు.. సైన్యం విన్యాసాలు - భారత వైమానిక దళం
పాకిస్థాన్ బాలాకోట్ దాడులకు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్ వైమానిక దళం దిల్లీ వేదికగా యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించింది.
'దాడులకు రెండేళ్లు.. సైన్యం విన్యాసాలు'
డమ్మీ స్థావరాన్ని యుద్ధ విమానం నుంచి కచ్చితమైన లక్ష్యంతో పేల్చింది. విన్యాసాల సందర్భంగా వైమానికదళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా కూడా యుద్ధ విమానంలో ప్రయాణించారు.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదంపై నవ భారత్ విధానానికి ఆ దాడి నిదర్శనం'