కరోనాతో సతమతం అవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకొస్తున్న వేళ ఆయా దేశాల నుంచి భారత వైమానిక దళం క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను భారత్‌కు తరలిస్తోంది. దుబాయ్, సింగపూర్ నుంచి ఐఏఎఫ్.. తొమ్మిది క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను భారత్‌లోని పనాగఢ్ వైమానికస్థావరానికి తరలించారు. వాటిని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా జామ్‌నగర్, రాంచి తరలించారు.
దేశంలోని ఒక నగరం నుంచి మరో నగరానికి కూడా.. ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్నట్లు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఖాళీ అయిన ట్యాంకర్లను కూడా.. ఫిల్లింగ్ స్టేషన్లకు తరలించడంలో ఐఏఎఫ్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.