భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్(nawab malik fadnavis). తనకు 1993 పేలుళ్ల కేసు దోషులతో సంబంధముందని ఆయన చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్ఠను మసకబార్చేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫడణవీస్కు సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి విషయం రేపు వెల్లడిస్తానని, ఆయనకే అండర్వరల్డ్తో సంబంధాలున్నాయని మాలిక్ చెప్పారు(nawab malik devendra fadnavis).
తనకు సంబంధించిన స్థలంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని గతంలో కూడా తప్పుడు ఆరోపణలు చేశారని మాలిక్ విమర్శించారు(Nawab Malik news). తనపై దుష్ప్రచారం చేస్తున్న ఫడణవీస్కు లీగల్ నోటీసులు పంపుతనని పేర్కొన్నారు.