నందిగ్రామ్‌లో తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని కూచ్ బెహార్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా స్పష్టం చేశారు.
"నాకు తెలుసు నేనే గెలుస్తానని. కానీ, నాతో పాటు మరో 200 మంది అభ్యర్థులు కూడా గెలిస్తేనే మేం ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతాం. అందుకే.. మీరు టీఎంసీకి ఓటు వేయండి."