తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే' - కమల్​ హాసన్​ పై ఆరోపణలు

తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటానని నటుడు కమల్​హాసన్​ ప్రకటించారు. పార్టీని ఎవరు వీడిపోయినా తాను మాత్రం రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

kamal haasan
'ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే'

By

Published : May 25, 2021, 5:38 AM IST

ఊపిరి ఉన్నంతవరకు తాను రాజకీయాల్లో ఉంటానని నటుడు, మక్కల్​ నీది మయ్యం అధ్యక్షుడు కమల్​హాసన్​ తెలిపారు. ఇటీవల తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఆయన సహా పార్టీ అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. అనంతరం పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కమల్​ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని కమల్​ సోమవారం ట్వీట్​ చేశారు.

ట్విట్టర్​లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్​ చేశారు. రాజకీయాలు ఉన్నంతవరకు తమ పార్టీ ఉంటుందన్నారు. రాజీనామా చేసిన వారు తమ తప్పును కప్పింపుచ్చుకునేందుకు చేసిన నిరాధార ఆరోపణలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాలమే వారికి బదులిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బంగాల్​ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ

ABOUT THE AUTHOR

...view details