జమ్ముకశ్మీర్లో చొరబాటుకు యత్నించి మంగళవారం.. భారత సైన్యానికి పట్టుబడిన అలీ బాబర్ పాత్రా పాకిస్థాన్(Pakistan news) పంజాబ్ ప్రాంతానికి చెందినవాడిగా ఒప్పుకున్నాడు. తనకు కరడుగట్టిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-taiba) శిక్షణ ఇచ్చిందని చెప్పాడు.
వస్త్ర కర్మాగారంలో(గార్మెంట్ ఫ్యాక్టరీ) పనిచేస్తున్న సమయంలో.. ఐఎస్ఐతో(Pakistan news) సంబంధాలున్న అనీస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించాడు. డబ్బులపై ఆశతో.. లష్కరే ముఠాలో చేరినట్లు నిజం అంగీకరించాడు. కశ్మీర్లో పరిస్థితులపై ఐఎస్ఐ, పాక్ సైన్యం(Pakistan terror news), ఎల్ఈటీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపాడు.
''మాది పాకిస్థాన్ పంజాబ్లోని ఒకారా. మా నాన్న చనిపోయాడు. మా అమ్మతో ఉంటున్నా. మా అక్కకు వివాహం అయింది. అనీస్ నాకు బాగా డబ్బులు ఇస్తా అన్నాడు. మాది పేద కుటుంబం. అందుకే అతనితో వెళ్లి లష్కర్లో చేరా. శిక్షణ సమయంలో వారు మాకు రూ. 20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయితే.. రూ. 30 వేలు ఇస్తామన్నారు.''
- మీడియాతో బాబర్
తనతో వచ్చిన వారిలో ఒకరిని భారత సైన్యం (Pakistan news India) హతమార్చిందని, మరో నలుగురు పారిపోయారని చెప్పుకొచ్చాడు. భయంతో తాను అక్కడే కూర్చుంటే.. భారత ఆర్మీ అరెస్టు చేసిందని వివరించాడు.