I-T Raids On Perfume Traders: దేశ వ్యాప్తంగా ఉండే పర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. కాన్పూర్, కన్నౌజ్, ముంబయి, సురత్, దిల్లీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లతో పాటు వారికి సంబంధించిన మరికొన్ని సంస్థల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కచ్చితంగా ఎవరిపై ఈ దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని అధికారులు ఎవరూ బహిర్గతం చేయలేదు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంఎల్సీ అయిన పుష్పరాజ్ అలియాస్ పంపి జైన్‌కు చెందిన కన్నౌజ్‌లోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేసింది. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. కన్నౌజ్‌లో మీడియా సమావేశానికి పిలుపునిచ్చిన సందర్భంగా భాజపా ప్రభుత్వం ఐటీ రైడ్స్‌కు తెర తీసిందని పేర్కొంది.
వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సమాజ్‌వాదీ పేరుతో పుష్పరాజ్ ఓ పర్ఫ్యూమ్ను విడుదల చేశారు.