తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ... తిరువణ్నామలై ఎమ్మెల్యే, డీఎంకే సీనియర్ నేత ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఈవీ వేలుకు సంబంధించిన 10 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిపింది.
ఈ ఎన్నికల్లోనూ తిరువణ్నామలై నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు వేలు. ఆయనకు మద్దతుగా డీఎంకే అధినేత స్టాలిన్ తిరువణ్నామలైలో ప్రచారం చేసేందుకు వచ్చిన సమయంలోనే ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.