తమిళనాడు చెన్నైలో ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో... ఐటీ సెజ్ మాజీ డైరెక్టర్, స్టెయిన్లెస్ స్టీల్ సరఫరాదారు కార్యాలయంలో రూ.450 కోట్లు నల్లధనం గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. నవంబరు 27న చెన్నై సహా ముంబయి, హైదారాబాద్, కడలూరులో ఈ సోదాలు నిర్వహించినట్లు వెల్లడించింది.
గడిచిన మూడేళ్లుగా ఐటీ సెజ్ మాజీ డైరెక్టర్, ఆయన కుటుంబ సభ్యులు కలిసి పలు అక్రమ మార్గాల ద్వారా రూ. 100 కోట్లు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. బోగస్ ప్రాజెక్టులు/ఫీజులు ద్వారా మరో రూ.190కోట్లు అక్రమ సంపద సృష్టించినట్లు పేర్కొన్నారు.