తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రూ.400కోట్ల అక్రమ నగదు పట్టుబడింది. ఈ నెల 11న చెన్నై, కోయంబత్తూర్, సేలం, విరుద్‌నగర్, తేనీ సహా 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమ పద్ధతిలో భారీ నగదు చలామణి జరిగినట్లు గుర్తించింది.
విదేశాల ద్వారా..
వ్యవసాయ వస్తువుల అమ్మకం, కొనుగోలు ముసుగులో వివిధ సంస్థల ద్వారా రూ.100 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగాయని సీబీడీటీ తెలిపింది. అంతేగాక ఈ లావాదేవీలన్నీ ఉద్యోగుల పేరుమీద జరిపినట్లు గుర్తించామంది. విదేశీ సంస్థల పెట్టుబడులు, బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులకు సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు తెలిపింది.