Yashwant Sinha: తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా.. ఆ పార్టీ నుంచి బయటకు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఈయన పేరు తెరపైకి వచ్చిన తరుణంలో ఆయన స్వయంగా ట్వీట్ చేశారు. జాతీయ ప్రయోజనాల కోసం.. విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన సమయం తప్పనిసరి అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు బంగాల్ సీఎం మమతా బెనర్జీకి కృతజ్ఞతలు చెప్పారు.
టీఎంసీ నుంచి బయటకు యశ్వంత్ సిన్హా.. అదే కారణమా? - మమతా బెనర్జీ
10:36 June 21
టీఎంసీ నుంచి బయటకు యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు, బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ పదవికి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిల్లీ నివాసంలో 17 పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. అక్కడే సిన్హాను ఖరారు చేసే అవకాశం ఉంది.
యశ్వంత్ సిన్హా గత ఏడాది భాజపా నుంచి బయటకు వచ్చి తృణమూల్‌లో చేరారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన సిన్హా 1984లో జనతాదళ్‌లో చేరారు. తర్వాత భాజపాలో చేరారు. ప్రస్తుతం తృణమూల్ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
ఇవీ చూడండి:ఉద్ధవ్ సర్కార్కు షాక్.. మంత్రి తిరుగుబాటు.. 11 మంది ఎమ్మెల్యేలతో జంప్?
రాష్ట్రపతి అభ్యర్థిపై భాజపా కీలక భేటీ.. విపక్షాల తరఫున సిన్హా?