కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందేమోనని ఓ విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కర్ణాటక చిక్కమగళూరులోని బెలెనహళ్లి గ్రామానికి చెందిన సోమనాయక్కు.. కొద్దిరోజుల క్రితం కరోనా వచ్చింది. దీంతో సూసైడ్ నోట్ రాసి కారులోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. తన కుటుంబానికి కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతోనే తనువు చాలిస్తున్నట్లు నోట్లో పేర్కొన్నాడు.
కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి - covid spread to family two people dead
కుటుంబ సభ్యులకు తమ నుంచి కరోనా సోకుతుందేమోనన్న భయంతో కర్ణాటకలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ వృద్ధురాలు ఉరేసుకొని చనిపోగా.. మరో వ్యక్తి తుపాకీతో కాల్చుకుని బలన్మరణానికి పాల్పడ్డాడు.

కరోనా భయం- తుపాకీతో కాల్చుకొని మృతి
మరోవైపు, చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ తాలుకాలో సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఇక్కడహళ్లి గ్రామానికి చెందిన 70ఏళ్ల సిద్ధమ్మకు మే 1న కొవిడ్ సోకింది. వైద్యుల సిఫార్సు మేరకు ఆ వృద్ధురాలు హోంక్వారంటైన్లో ఉంది. అయితే, ఇంట్లోని చిన్నపిల్లలకు తన నుంచి కరోనా సోకుతుందన్న భయంతో మే 3న ఉరేసుకుని చనిపోయింది.
ఇదీ చదవండి:ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం