ఒడిశా బార్గఢ్లోని సోహెలా జైలులో ఓ అండర్ట్రైయల్ ఖైదీ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి అరచేతిపై 'ఐ లవ్ యూ మంజు' అని రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మంజు అతడి భార్య. చనిపోయిన అండర్ట్రైయల్ ఖైదీ.. పెటుపాలీ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మోహిత్ రౌత్. జైలులో అతడి శవం వేలాడుతూ ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆస్పత్రికి తరలించగా.. అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసహజ డెత్ కేసుగా పోలీసులు దీనిని నమోదు చేశారు.
భార్యను చంపి జైలుకు.. చేతిమీద 'ఐ లవ్ యూ' అని రాసి సూసైడ్!
భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై అరెస్టైన ఓ అండర్ ట్రైయల్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి చేతితో ఐ లవ్ యూ అని భార్య పేరు రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఒడిశాలోని సోహెలా జైలులో జరిగింది.
Prisoner
వరకట్నం వివాదం కారణంగా భార్య మంజును హత్య చేశాడనే ఆరోపణలపై రెండు రోజుల క్రితం మోహిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యాదృచ్ఛికంగా మంజు మృతదేహాన్ని రికవరీ చేసుకునే సమయంలో ఆమె చేతిపై 'ఐ లవ్ యూ మోహిత్' అని రాసి ఉంది.
ఇదీ చూడండి:బెడ్‌షీట్‌పై 'పీరియడ్స్' మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్ షాక్!