పెరుగుతోన్న పెట్రోల్ ధరల విషయంలో ప్రముఖ బాలీవుడ్ నటులు.. అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్లకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. వారు నిజమైన హీరోలు కారన్న ఆయన.. పెట్రోల్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండే వారు కాదని తెలిపారు. వారు కేవలం తెర మీద మాత్రమే హీరోలని పేర్కొన్నారు.
వారి సినిమాలు విడుదలైనా, నటులు ఎదురుపడ్డా.. నల్లజెండాలు ప్రదర్శిస్తామని వ్యాఖ్యానించారు. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ స్పందించకుంటే.. వారి సినిమా ప్రదర్శనలను మహారాష్ట్రలో నిలిపివేస్తామని పటోలే ఇప్పటికే హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన ఆయన.. ప్రజాస్వామ్య విధానంలో తమ నిరసన కొనసాగుతుందని తెలిపారు. 'మేము గాంధీ వారసులమే కానీ గాడ్సేకి చెందిన వారిమి కాదు' అని అన్నారు.
అమితాబ్ ఇంటి వద్ద పోలీసు భద్రత పటోలే వ్యాఖ్యల నేపథ్యంలో అమితాబ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు.
ఇదీ చూడండి: 'అమితాబ్, అక్షయ్.. సినిమాలను అడ్డుకుంటాం'