నూతన సాగు చట్టాలు ఏడాది పాటు అమలయ్యే వరకు రైతులు వేచి చూడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అప్పటికీ రైతుల అభిప్రాయం మారకపోతే చట్టాలను సవరించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతులపై తమకు అపారమైన గౌరవం ఉందన్నారు రాజ్నాథ్.
"సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులు చర్చకు రండి. దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తోన్న వారందరూ రైతులు, రైతు బిడ్డలే. మీపై మాకు అపారమైన గౌరవం ఉంది. మా ప్రభుత్వం రైతులకు హాని కలిగించే చట్టాలు చేయదు. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. రైతులతో చర్చలు కొనసాగించాలని ప్రధాని కోరుకుంటున్నారు.
ఓ ఏడాది పాటు ఈ చట్టాలను అమలు చేద్దాం. రైతులకు మేలు చేకూరలేదు అనుకుంటే సవరణలకు సర్కార్ సిద్ధంగా ఉంది."
- రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి