I and B Ministry blocks YouTube channels: భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన 4 న్యూస్ ఛానెళ్లు కూడా ఉన్నాయి. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. వీటితో పాటు మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ ఫేస్బుక్ ఖాతా, ఒక న్యూస్ వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం బ్లాక్ చేసింది.
భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్‌నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గ్రహించింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ అంశాలతోపాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.