సుప్రీంకోర్టులో దిల్లీ కాలుష్యం కేసు వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ(cji nv ramana), సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. దిల్లీ కాలుష్యానికి రైతులు కారణం అన్న తుషార్ మెహతా వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ ఎన్‌వీ రమణ.. రైతులపైనే నెపం మోపడం సరికాదని అన్నారు. దీనిపై వివరణ ఇచ్చిన తుషార్ మెహతా.. కాలుష్యానికి రైతులు మాత్రమే కారణం అన్నది తన ఉద్దేశం కాదని తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ.. దురదృష్టవశాత్తు తాను ఆంగ్ల భాషను చక్కగా వ్యక్తీకరించలేనని తెలిపారు(cji nv ramana news). ఆంగ్లాన్ని తాను 8వ తరగతి నుంచి చదువుకోవడం ప్రారంభించానని వివరించారు. న్యాయవిద్యను ఆంగ్ల భాషలో చదువుకున్నానని జస్టిస్ ఎన్‌వీ రమణ వెల్లడించారు(cji nv ramana news latest) .
ఆంగ్లంపై సీజేఐ- సొలిసిటర్ జనరల్ మధ్య ఆసక్తికర సంభాషణ
దురదృష్టవశాత్తూ తాను ఆంగ్ల భాషను చక్కగా వ్యక్తీకరించలేనని సీజేఐ జస్టిస్ రమణ(cji nv ramana) అన్నారు. దిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 8 తరగతి నుంచి ఆంగ్లం చదువుకోవడం ప్రారంభించిన్నట్లు చెప్పారు(cji nv ramana news).
'నేను ఆంగ్ల వక్తను కాదు.. ఆ భాష 8 తరగతి నుంచి నేర్చుకున్నా'
దీనికి సమాధానమిచ్చిన తుషార్ మెహతా.. తాను కూడా 8వ తరగతి నుంచే ఆంగ్లం చదువుకోవడం ఆరంభించానని, న్యాయవిద్యను ఆంగ్లంలోనే అభ్యసించానని వివరించారు. మనం ఒకే పడవలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:దిల్లీలో స్కూళ్లు మూసివేత.. వారం రోజులు లాక్డౌన్!