బంగాల్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ర్యాలీకి హాజరయ్యారు. ఈ సభలోనే ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన.. తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. తానోక కింగ్ కోబ్రా అని... అధికార పార్టీని ఒకే దెబ్బకు అంతం చేస్తానని అన్నారు. తన బెంగాలీ చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన సంభాషణలను ఉటంకిస్తూ.. 'బ్రిగేడ్ మైదానం ఉల్లాసంగా ఉంది. . ఏక్ చోబోలే చోబీ' అనే కొత్త నినాదాన్ని గుర్తుంచుకోండి అని అన్నారు.
'నేనో కోబ్రా.. ఒకే కాటుకు అంతం చేస్తా'
బంగాల్ శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో రాష్ట్ర భాజపాలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి.. ప్రధాని మోదీ హాజరైన ర్యాలీలో కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. తాను కోబ్రా లాంటి వాడినని ... ప్రత్యర్థిని ఒకే దెబ్బకు అంతం చేస్తానని అన్నారు.
'ఈ దెబ్బతో తృణమూల్ పార్టీ మూసేయాల్సిందే'
రెండు సార్లు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న మిథున్.. ఆ పార్టీకి రాజీనామా చేసి కమల దళంతో జత కట్టారు. నరేంద్ర మోదీ హజరైన ఈ ర్యాలీకి భాజపా ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సువేందు అధికారి కూడా పాల్గొన్నారు.