తెలంగాణ

telangana

13 గంటల్లో 30 కిలోమీటర్లు ఈది మహిళ రికార్డు

హైదరాబాద్​కు చెందిన 48 ఏళ్ల శ్యామలా గోలీ అరుదైన ఘనత సాధించారు. శ్రీలంకలోని తలైమన్నార్​ తీరం నుంచి తమిళనాడులోని ధనుష్​కోడికి ఈత కొట్టారు. 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది రికార్డు సృష్టించారు.

By

Published : Mar 20, 2021, 3:00 PM IST

Published : Mar 20, 2021, 3:00 PM IST

48 ఏళ్ల మహిళ అరుదైన రికార్డ్​!
48 ఏళ్ల మహిళ అరుదైన రికార్డ్​!

48 ఏళ్ల మహిళ అరుదైన రికార్డ్​!

హైదరాబాద్​కు చెందిన ఓ మహిళ అరుదైన ఘనత సాధించారు. 48 ఏళ్ల శ్యామలా గోలీ శ్రీలంకలోని తలైమన్నార్​ నుంచి తమిళనాడులోని ధనుష్​కోడి వద్ద ఉన్న అరిచల్​ మునయ్​ బీచ్​ వరకు ఈత కొట్టారు. శ్రీలంక నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతానికి కేవలం 13 గంటల 40 నిమిషాల్లో చేరుకోవడం విశేషం. తలైమన్నార్​ నుంచి శుక్రవారం ఉదయం 4.10 గంటలకు ఈత ప్రారంభించి.. సాయంత్రం 5.50 గంటలకు ధనుష్​కోడి చేరుకున్నారు. పల్క్​ స్ట్రెయిట్​లో ఈదిన రెండవ భారతీయురాలి​గా రికార్డు సృష్టించారు.

"పల్క్​ స్ట్రెయిట్​లో ​ఈత కొట్టేందుకు భారత్​, శ్రీలంకల నుంచి గతేడాదే అనుమతి లభించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఓ మహిళగా నేను నెలకొల్పిన రికార్డు ఇతరలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నా."

-శ్యామలా గోలీ

శ్యామలా గోలీ గతంలో పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. తెలంగాణ తరఫున దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్​ మాస్టర్స్​ ఛాంపియన్​ షిప్​ సహా బిహార్​లో గంగా నదిలో జరిగిన ఈత పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆ పోటీలో ఆమె 13 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల్లో పూర్తి చేయడం గమనార్హం.

తమిళనాడు, శ్రీలంకల మధ్య ఉన్న సముద్ర ప్రాంతమే పల్క్​​స్ట్రెయిట్​. ప్రమాదకర మార్గంగా పేర్కొనే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రపంచదేశాలకు చెందిన 13 మంది మాత్రమే ఈత కొట్టారు. ​

ఇదీ చూడండి :వైరల్​: జూలో వ్యక్తిపై సింహం దాడి

ABOUT THE AUTHOR

...view details