IRCTC Hyderabad Shirdi Tour Package : దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునేవారికోసం.. ఐఆర్‌సీటీసీ టూరిజం ఈమధ్య ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. టూరిస్టులకు ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో ఈ స్పెషల్ టూర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా హైదరాబాద్ నుంచి షిరిడీ టూర్(Shirdi Tour) ప్యాకేజీని అనౌన్స్ చేసింది. 'SAI SANNIDHI EX HYDERABAD' పేరుతో ఈ టూర్‌ను ఐఆర్‌సీటీసీ(IRCTC) ఆపరేట్ చేస్తోంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా.. ప్రస్తుతం సెప్టెంబర్ 20, 2023న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. అసలు ఎన్ని రోజులు టూర్ సాగుతుంది? టికెట్ ధర ఎంత? ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్-షిరిడీ పర్యటన సాగనుందిలా..
IRCTC Hyderabad to Shirdi Tour Package : ఐఆర్‌సీటీసీ 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ ట్రైన్ (అజంతా ఎక్స్ ప్రెస్ train no. 17064).. సెప్టెంబర్ 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతుంది. ఆ రోజు రాత్రంతా రైలులో ప్రయాణిస్తారు.
Second Day : రెండో రోజు 21న ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి షిరిడీ వెళ్తారు. అక్కడ హెటల్లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిరిడీ సాయినాథుని ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి శని శిగ్నాపూర్ వెళ్తారు. అక్కడి నుంచి బయల్దేరి నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌కు బయల్దేరుతారు. రాత్రి 08 గంటల 30 నిమిషాలకు మీ జర్నీ తిరిగి స్టార్ట్ అవుతుంది.