Hyderabad Techie Killed in Road Accident : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు వీకెండ్ వచ్చిందంటే కాస్త రిలాక్స్ అవ్వడానికి మినీ టూర్ వేయాల్సిందే. అలా ఓ మిత్రబృందం హైదరాబాద్‌లో మూడు బైకులపై వీకెండ్ విహారయాత్రకు వెళ్లింది. రోజంతా నగర శివారుల్లోని పలు టూరిస్ట్ ప్రాంతాలు తిరిగారు. ప్లాన్ చేసుకున్నట్లు వెళ్లాలనుకున్న ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత చివరకు కేబుల్ బ్రిడ్జి చూడాలనుకున్నారు. అందుకోసం కేబుల్ బ్రిడ్జివైపు మూడు బైకులతో వారంతా పయనం మొదలుపెట్టారు.
Software engineer died in Hyderabad : కేబుల్ బ్రిడ్జికి వారున్న ప్రాంతం నుంచి రూట్ సరిగ్గా తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ఆధారంగా ప్రయాణించారు. రెండు బైకులపై ఉన్న వారు కరెక్ట్‌గానే వెళ్లారు. కానీ మూడో బైకుపై ఉన్న వారు మాత్రం దారి తప్పారు. కాస్త దూరం వెళ్లాక దారి తప్పిన విషయం గమనించి తిరిగి వెనక్కి వెళ్దామనుకున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరిగి బైక్ నడిపిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడాడు. అతడితో పాటు ఉన్న ఇద్దరమ్మాయిలు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటన నగర శివారులో మెహిదీపట్నం-శంషాబాద్ మధ్యలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా చిన్న గొల్లపాలెం గ్రామానికి చెందిన చరణ్(22) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. పోచారం సమీపంలోని టౌన్షిప్లో స్నేహితులతో కలసి రూంలో ఉంటున్నాడు. శనివారం వారాంతపు సెలవు అయినందున స్నేహితులంతా కలిసి మూడు ద్విచక్ర వాహనాలపై 9 మంది భాగ్యనగరానికి వచ్చారు. చరణ్ వాహనం వెనుక ఇద్దరు అమ్మాయిలు కుర్చున్నారు. ఉత్సాహంగా నూతన సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం చూశారు. అనంతరం కాసేపు ట్యాంక్‌బండ్‌పై కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. తరవాత తీగల వంతెనకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.