Hyderabad Rowdy Sheeter Muder Case Update :చాంద్రాయణగుట్ట బార్కస్ ప్రాంతానికి చెందిన షేక్ సయీద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బావజీర్ అలియాస్ సయీద్ బావజీర్ అవివాహితుడు. ఇతడిపై హైదరాబాద్, రాచకొండ పరిధిలో 11 పోలీసు కేసులున్నాయి. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులు ఇతడిపై రౌడీషీట్ తెరిచారు. చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తుండటంతో 2018లో పీడీయాక్ట్ ప్రయోగించారు.
Rowdy Sheeter Saeed Bawajeer Murder case : మరో వ్యక్తి సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన అహ్మద్ బిన్ హజీబ్‌పై హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 6 కేసులున్నాయి. భవానీనగర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ తెరిచారు. 2021లో పోక్సో కేసులో సయీద్ బావజీర్ చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నపుడు అహ్మద్ బిన్ హజీబ్ పరిచమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక స్నేహం మరింత బలపడింది. సయీద్ బావజీర్ స్వలింగ సంపర్కం అలవాటు ఉండటంతో హజీబ్ అసహజ శృంగారంతో దగ్గరవుతుండేవారు. దీన్ని అవకాశం చేసుకొని తన కోసం అతడి స్నేహితులను అసహజ శృంగారానికి ఒప్పించమంటూ హజీబ్‌పై ఒత్తిడి పెంచాడు.
ఈ ఒత్తిడి భరించలేక మొగల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అయూఖాన్‌ను హజీబ్ బావజీర్ వద్దకు తీసుకెళ్లాడు. అతడు తిరస్కరించినపుడు జరిగిన గొడవతో సయీద్ బావజీర్ గుట్టు వెలుగుచూసింది. ఇతడు జల్‌పల్లి పురపాలక సంఘం పరిధిలోని స్థానిక సమస్యలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలపై వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండేవాడు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో తమను చులకన చేస్తున్నాడని జల్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ అహ్మద్‌సాది, అతడి తండ్రి అబ్దుల్లాసాదిలు సయూర్ బావజీర్పై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు హెచ్చరించినా మారకపోవటంతో ఎలాగైనా అడ్డుతొలగించాలనే పథకం వేశారు. గతంలో రెండుసార్లు సుపారీ ముఠాతో హత్య చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
FRO Srinivasa Rao Murder Case : ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
పేరు బయటకి రాకుండా హత్యకు రూ.13 లక్షలకు ఒప్పందం :ఇదే క్రమంలో రౌడీషీటర్ సయీద్ బావజీర్ స్వలింగ సంపర్కుడనే విషయం అహ్మద్ సాది, అతడి తండ్రి అబ్దుల్లా సాదిలకు తెలిసింది. దాన్నే ఆయుధంగా ప్రయోగించి హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు. గత నెల చివర్లో హజీబ్‌తో చర్చించారు. హత్యకు రూ.13 లక్షలకు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ పేరు బయట పడకుండా చూడాలని కోరారు. అసహజ శృంగార సమయంలో తలెత్తిన గొడవతో జరిగిన హత్యగా చిత్రీకరించాలని, పోలీసులనూ నమ్మించాలని నిర్ణయానికి వచ్చారు.